![]() |
![]() |

స్మాల్ స్క్రీన్ పై రవికృష్ణ అంటే గుర్తుపట్టే అభిమానులు ఉన్నారు. ఎన్నో సీరియల్స్ లో, రియాలిటీ షోస్ లో పార్టిసిపేట్ చేస్తూ సొంత గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక రవికృష్ణ అంటే నవ్యస్వామి ఆటోమేటిక్ గా గుర్తొచ్చేస్తుంది. చాలా షోస్ లో వీళ్ళు కలిసే కనిపిస్తారు. కానీ ఇద్దరి మధ్య ఏముంది అంటే మాత్రం ఏం లేదు అంటారు తప్ప ఏ విషయం చెప్పారు. ఆమె కథ సీరియల్ లో వీళ్ళ పెయిర్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ అప్పట్లో చాలా ఉంది. ఎప్పుడు నవ్యస్వామితో స్టెప్పులేసే రవికృష్ణ ఇప్పుడు కొత్త నిర్ణయం తీసుకున్నాడు. రూటు మార్చి గోరింటాకు సీరియల్ ఫేమ్ కావ్యతో కలిసి స్టెప్పులేశాడు.
గోరింటాకు కావ్య కూడా అంతే ఆ సీరియల్ హీరోతోనే ఏ షోకైనా కలిసి వెళ్తుంది, స్టెప్పులేస్తోంది. బట్ ఈ షోలో మాత్రం వాళ్ళ వాళ్ళ పార్టనర్స్ ని వదిలేసి డాన్స్ చేశారు రవికృష్ణ, కావ్య. ఇప్పుడు ఆ పిక్స్ వైరల్ గా మారాయి. జూన్ 12 th న ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ సీరియల్ ప్రోమోలో వీళ్ళ హాట్ సాంగ్ చూసి అందరూ అవాక్కవుతున్నారు. ఈ సాంగ్ లో ఇద్దరూ చాలా రొమాంటిక్ గా పెర్ఫర్మ్ చేశారు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇక కావ్య బ్లాక్ అండ్ మెరూన్ శారీలో , రవికృష్ణ స్లీవ్ లెస్ షర్ట్ లో డాన్స్ చేసి స్టేజిని హీటెక్కించారు. వీళ్ళ స్టెప్పులు చూసి పూర్ణ కూడా "హాటబ్బా" అంటూ కామెంట్ చేసింది. మరి ఈ షోకి నవ్యస్వామి ఎందుకు రాలేదు ? రవిక్రిష్ణను వదిలేసిందా లేదా ఇంకేదైనా షోలో ఎంగేజ్ అయ్యిందా ? అని ఆడియెన్స్ గుసగుసలాడుకుంటున్నారు.
![]() |
![]() |